Smartphones in 2025: 2025లో స్మార్ట్ ఫోన్లలో వచ్చే పెను మార్పులు ఇవే - ఇకపై అన్నీ మారతాయా?
ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ను స్మార్ట్ ఫోన్లలో అందించనున్నారు. వాయిస్ అసిస్టెంట్లు, పర్సనల్ ఏఐ ఇప్పుడు మరింత స్మార్ట్ కానున్నాయి. అవి యూజర్లను బట్టి పని చేస్తాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్మార్ట్ ఫోన్లలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల వంటి కొత్త తరహా బ్యాటరీలను అందించనున్నారు. వీటి కెపాసిటీ ఎక్కువగా ఉండటమే కాకుండా కేవలం నిమిషాల్లోనే ఛార్జ్ చేసేయవచ్చు.
స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో 200 మెగాపిక్సెల్ లేదా అంతకంటే పెద్ద కెమెరాలు, నైట్ విజన్, 3డీ రికార్డింగ్ వంటి ఫీచర్లు రానున్నాయి. ఇకపై ఇవి డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో సమానంగా పని చేయనున్నాయి.
5జీతో పాటు త్వరలో స్మార్ట్ ఫోన్లలోనే శాటిలైట్ కనెక్టివిటీ అందించనున్నారు. దీని ద్వారా నెట్ వర్క్ లేకుండానే మారుమూల ప్రాంతాల్లో కూడా కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లలో హోలోగ్రామ్ డిస్‌ప్లే ఉండనుంది. దీని ద్వారా వీడియో కాల్స్, వర్చువల్ మీటింగ్స్ చేసుకోవచ్చు. మంచి 3డీ ప్రొజెక్షన్‌ను కూడా ఇవి అందించనున్నాయి.
స్మార్ట్ ఫోన్లను త్వరలో డ్యూరబుల్, రీసైకిలబుల్ మెటీరియర్స్‌తో తయారు చేయనున్నారు. ఇది పర్యావరణానికి కూడా చాలా మంచిది.
హార్ట్ రేట్ మానిటర్లు, బీపీ చెకింగ్, షుగర్ లెవల్ చెకింగ్ టెక్నాలజీను నేరుగా డివైస్‌ల్లో అందించనున్నారు. దీంతోపాటు ఏఆర్, వీఆర్ ఫీచర్లు కూడా వీటిలో చూడవచ్చు. ఇవి గేమింగ్, వర్చువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచనున్నాయి.
త్వరలో కొన్ని స్మార్ట్ ఫోన్లు మాడ్యులర్ డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అంటే యూజర్లు కెమెరా, బ్యాటరీ, స్టోరేజ్‌ను తమ అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చన్న మాట.