Incognito Mode History Delete:మొబైల్, ల్యాప్‌టాప్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ హిస్టరీని ఇలా ఈజీగా డిలీట్ చేసేయండి!
Incognito Mode History Delete: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో మీరు బ్రౌజర్‌కు ఓపెన్ చేసిన పేజీలు, కుకీలు, ఫారమ్ డేటా లేదా బ్రౌజింగ్ చరిత్రను మీ సిస్టమ్‌లో సేవ్ చేయదు. అంటే మీరు ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ను మూసివేసిన వెంటనే, ఆ సమాచారం అంతా డిలీట్ అవుతుంది. అయితే, దీని అర్థం మీ యాక్టవిటీ ఇంటర్నెట్ నుంచి పూర్తిగా కనిపించకుండా పోతుందని కాదు. మీ బ్రౌజింగ్ ఇప్పటికీ మీ ఇంటర్నెట్ ప్రొవైడర్, రౌటర్, కొన్ని థర్డ్‌పార్ట టూల్స్ రికార్డ్‌లలో ఉండవచ్చు. ముఖ్యంగా DNS కాష్, నెట్‌వర్క్ లాగ్‌లలో మీ ఇన్‌కాగ్నిటో యాక్టివిటీ చూడొచ్చు.
Incognito Mode History Delete: ఇలాంటప్పుడు, మీరు ఇన్కాగ్నిటో మోడ్లో చేసిన బ్రౌజింగ్ పూర్తిగా తొలగిపోయందని నిర్ధారించుకోవాలనుకుంటే, DNS కాష్‌ని క్లియర్ చేయడం ఒక సులభమైన మార్గం. మీరు ఏదైనా షేర్డ్ కంప్యూటర్ లేదా Wi-Fi నెట్‌వర్క్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీ ప్రైవేట్ సెర్చ్ గురించి ఎవరికీ తెలియకూడదని అనుకున్నప్పుడు ఈ స్టెప్ ముఖ్యంగా అవసరం.
Incognito Mode History Delete: విండోస్ లేదా మాక్ వంటి సిస్టమ్లలో DNS క్యాషీని మాన్యువల్‌గా తొలగించవచ్చు. మీరు DNS క్యాషీ క్లియర్ చేసినప్పుడు, మీరు సందర్శించిన వెబ్సైట్ల చిరునామాలు సిస్టమ్ నుంచి తొలగిపోతాయి. ఇవి సాధారణంగా సాంకేతికంగా బ్యాక్ఎండ్‌లో సేవ్ అవుతాయి. మీరు ఇన్కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించినప్పటికీ. ఈ ప్రక్రియ చాలా సులభం, కేవలం ఒక కమాండ్ ద్వారా పూర్తి చేయవచ్చు.
Incognito Mode History Delete: అదనంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, తల్లిదండ్రుల నియంత్రణ లేదా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటివి, ఇన్కాగ్నిటో మోడ్లో చేసిన బ్రౌజింగ్‌ను కూడా పర్యవేక్షించవచ్చు. అలాంటి యాప్‌ను నివారించడానికి లేదా వాటి పర్యవేక్షణను ఆపడానికి మీరు మీ సిస్టమ్ సెట్టింగ్స్‌ను చెక్ చేయాలి. అలాగే, మీరు రౌటర్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటే, రౌటర్ లాగ్‌లలో కూడా మీ వెబ్ యాక్టివిటీ సేవ్ చేసిఉండొచ్చు గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ లాగ్‌లను మాన్యువల్గా తొలగించడానికి మీరు రౌటర్ అడ్మిన్ ప్యానెల్కు వెళ్లాలి.
Incognito Mode History Delete: మొత్తం మీద, ఇంకాగ్నిటో మోడ్ ను ఉపయోగించడం మీ బ్రౌజింగ్ అనుభవాన్ని ప్రైవేట్ గా ఉంచుకోవడానికి ఒక మంచి మార్గం, కానీ ఇది పూర్తిగా రహస్యంగా ఉంటుందని అనుకోవడం పొరపాటు అవుతుంది. మీరు మీ ఇంకాగ్నిటో బ్రౌజింగ్ జాడ కూడా లేకుండా ఉండాలనుకుంటే, DNS క్యాషీను క్లియర్ చేయడం, థర్డ్ పార్టీ నిఘాను తొలగించడం, రౌటర్ లాగ్లను తొలగించడం చాలా సులభమైన, ప్రభావవంతమైన మార్గం. కొంచెం జాగ్రత్త, వివేచనతో, మీరు మీ ఆన్లైన్ గోప్యతను మరింత మెరుగ్గా సురక్షితంగా ఉంచుకోవచ్చు.