Smart Watch Deals: స్మార్ట్‌వాచ్ కొందామనుకుంటున్నారా? అయితే ఈ డీల్స్ చూడండి..
వాచ్ అంటే ఒకప్పుడు టైమ్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వాచ్‌లు కూడా అప్‌డేట్ అయి స్మార్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఇందులో ఫోన్ నోటిఫికేషన్లు, ఫిట్‌నెస్ ట్రాక్ చేయడం, హార్ట్ బీట్ చెక్ చేయడం, స్పోర్ట్ మోడ్ ఇలా బోలెడు ఫీచర్లు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా హ్యాండ్ వాష్ రిమైండర్ ఫీచర్లు ఉన్న వాచ్‌లు కూడా వచ్చాయి. మీరు కూడా స్మార్ట్‌వాచ్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్ యాప్స్‌లో మాంచి డీల్ నడుస్తోంది. మరి ఆఫర్లతో ఏమేం వాచ్‌లు వస్తున్నాయో చూద్దామా?
అమేజ్ ఫిట్ బిప్ యూ ప్రో (Amazfit Bip-U Pro). ఈ వాచ్ 1.43 అంగుళాల లార్జ్ కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీ మూడ్ ఎలా ఉందో ట్రాక్ చేసి చెబుతుంది. 60కి పైగా స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఆఫర్ కింద రూ.4,699కే లభిస్తుంది.
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 2 (Noise ColorFit Pro 2).. ఈ వాచ్‌లో 1.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. వాకింగ్, రన్నింగ్, ట్రెడ్ మిల్, వర్కవుట్, యోగా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.2799గా ఉంది.
క్రాస్ బీట్స్ ఏస్ మెటల్ వాచ్ (CrossBeats Ace Metal) ఎల్సీడీ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 8 మల్టీ మోడ్ గేమ్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంది. డిస్కౌంట్ ధరతో రూ.3799కి లభిస్తుంది.
ఫైర్ బోల్ట్ రింగ్ (Fire Boltt Ring) వాచ్ 1.7 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 2.5D కర్వ్‌డ్ గ్లాస్ డిజైన్‌తో లభిస్తుంది. ఎస్ పీఓ2 మానిటర్, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్లను ట్రాక్ చేసే ఫీచర్లు ఉన్నాయి. స్లీప్ మానిటర్, స్టెప్ కౌంట్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని ధర రూ.4499గా ఉంది.
GOQii స్మార్ట్ వైటల్ వాచ్ (GOQii smart vital) బ్యాటరీకి ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ పెడితే 7 రోజుల వరకు ఉంటుంది. ఇందులో ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసే ఫీచర్ ఉంది. 24*7 మన హార్ట్‌రేట్‌ను మానిటర్ చేస్తుంది. మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై వాచ్, స్టాప్ వాచ్, టైమర్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.4,499గా ఉంది.
పెబ్బల్ కాస్మోస్ (Pebble Cosmos).. దీనిలో శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి థర్మోమీటర్ ఉంటుంది. 8 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, హార్ట్ రేట్ తెలుసుకునే ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.3999గా ఉంది.