Video is real or made by AI: ఓ వీడియో ఒరిజినల్ ఆ AIతో క్రియేట్ చేశారా ఇలా చేస్తే నిమిషాల్లో తెలుసుకోవచ్చు
నకిలీ వీడియోలు, అంటే డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలుతో కొందరు ఇతరుల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కానీ డీప్ ఫేక్ ద్వారా అపార్థాలు చోటుచేసుకునే పరిస్థితులున్నాయ. సరిగ్గా గమనిస్తే పెదవుల కదలికలు వాయిస్ తో సరిపోలవు. కంటి పాపల కదలికలు అసాధారణంగా ఉంటాయి. అసలైన వీడియోలో ప్రతిదీ సహజంగా ఉంటుంది. నకిలీ వీడియోలో ముఖం లైటింగ్, నీడ సరిపోలవు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరొక పద్ధతి వీడియో ఫ్రేమ్ను ఆపి పరీక్షించడం. ఏదైనా వీడియోను పాజ్ చేసి, మీరు ముఖాలు, జుట్టు లేదా నేపథ్యాన్ని జాగ్రత్తగా చూస్తే, చాలాసార్లు ఫ్రేమ్లో అస్పష్టత లేదా 'గ్లిచ్' కనిపిస్తుంది. వీడియో AI ద్వారా తయారు చేయబడిందని ఇది సూచిస్తుంది.
ఆడియోపై కూడా ఫోకస్ చేయాలి. డీప్‌ఫేక్ వీడియోలలో వాయిస్ లేదా టోన్ చాలాసార్లు మెషిన్ తరహాలో అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ సహజంగా ఉండదు. అసలైన వీడియోలో వాయిస్‌లో భావోద్వేగాలు, వాయిస్ సహజంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే AI రూపొందించిన వీడియోలో ఇది లోపిస్తుంది.
మీరు వైరల్ వీడియో రియాలిటీని తెలుసుకోవాలనుకుంటే Google Lens లేదా InVID వంటి టూల్స్ ఉపయోగించాలి. వీటి ద్వారా వీడియో ఫ్రేమ్ లేదా స్క్రీన్‌షాట్ తీసి దాని సోర్స్ ఎక్కడ ఉందో గుర్తించడంలో సహాయపడతాయి. దీంతో పాటు ఇప్పుడు డీప్‌ఫేక్ కంటెంట్ గుర్తించగల పలు AI డిటెక్షన్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి.
భవిష్యత్తులో డీప్ ఫేక్ (DeepFake) వీడియోల ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది కనుక సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో ఒరిజినల్ అని భావించలేం. ఏదైనా వీడియోను చూస్తే దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటని తప్పనిసరిగా పరిశీలించండి. అప్పుడే మీకు ఒరిజినల్ వీడియోనా కాదా తెలుస్తుంది.