Hanuman: మంగళవారం నాడు హనుమాన్ పూజలో పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి!
వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి అంకితం చేసి పూజలు చేస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే మంగళవారం నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
మంగళవారం ఉదయం స్నానం చేసిన తరువాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించండి. హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. సింధూరం, బెల్లం , శనగలు నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో అయితే దీపం వెలిగించి ఆంజనేయుడికి ఎర్రటి పూలతో పూజచేసి నైవేద్యం సమర్పించండి . హనుమాన్ చాలీసా పఠించండి.
మంగళవారం నాడు మాంసాహారం , ఉల్లి, వెల్లుల్లి తినకూడదని చెబుతారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. శుద్ధమైన ఆహారం మనస్సును శాంతింపజేస్తుంది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని చెబుతారు.
శాస్త్రాలలో మంగళవారం వ్రతం ఆచరించడం వల్ల మంగళ గ్రహ దోషాలు తొలగిపోతాయని, జీవితంలో విజయం లభిస్తుందని ఉంది. వ్రతం చేసే వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే ఫలాహారం లేదా తేలికపాటి భోజనం చేయాలి. వ్రతం సమయంలో హనుమంతుని నామం జపిస్తూ ఉండాలి, దీనివల్ల ఇంట్లో సుఖ-శాంతి నెలకొంటుంది.
మంగళవారం నాడు శివుడిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నీరు, పాలు, చందనంతో అభిషేకం చేయండి.
గుడిలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళండి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేసి హారతి ఇవ్వండి