Flipkart Carnival Sale: ఫ్లిప్‌కార్ట్‌లో కార్నివాల్ సేల్.. ఐఫోన్ 12పై రూ.13 వేల వరకు డిస్కౌంట్..
స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ నడుస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 8 వరకు పలు మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సేల్‌లో భాగంగా పాత ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆప్షన్లతో పాటు నోకాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. మరి ఈ కార్నివాల్ సేల్‌లో మంచి డీల్స్ ఉన్న ఫోన్లు ఏంటో చూద్దామా?
ఐఫోన్ 12పై రూ.13 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 12 ధర రూ.79,900 కాగా.. సేల్‌లో రూ.66,999కే లభిస్తుంది. అంటే దాదాపు రూ.12,901 డిస్కౌంట్ వస్తుంది. ఇక ఏదైనా ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఇంకో రూ.15,000 ధర కూడా తగ్గుతుంది. ఐఫోన్ 12లోని అన్ని వేరియంట్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఐఫోన్ 12 మినీ ధర రూ.69,900 కాగా.. డిస్కౌంట్ కింద రూ.9,901 ధర తగ్గుతుంది. ఈ ఫోన్ రూ.59,999 ధరకే లభిస్తుంది. ఐఫోన్ 11 ధర రూ.54,900 కాగా.. సేల్ కాస్ట్ కింద రూ.51,999కే కొనుక్కోవచ్చు. ఐఫోన్ ఎక్స్‌ఆర్ కూడా సేల్ కింద రూ. 42,999 ధరకే లభిస్తోంది.
రియల్‌మీ నార్జో 30 5 జీ ధర రూ.14,999 కాగా.. రూ.1000 తగ్గింపు లభిస్తుంది. రియల్‌మీ ఎక్స్ 7 మ్యాక్స్5జీ ధర రూ. 26,999కి లభిస్తుంది. ఇన్‌ఫినిక్స్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9999 కాగా.. డిస్కౌంట్ లో రూ. 9,499కే కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎం3 ప్రారంభ ధర రూ.10999 కాగా.. రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.10,499కే కొనుక్కోవచ్చు. ఎంఐ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 34,999 రేటుకే కొనుగోలు చేయవచ్చు.