iPhone New Update: పిల్లల భద్రతకు ఐఫోన్లలో కొత్త ఫీచర్.. దీంతో అశ్లీలతకు చెక్!
పిల్లల భద్రత కోసం యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్ఏఎం), అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కొత్త టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఐఫోన్లలో ఫొటోలు, మెసేజ్‌లను స్కాన్ చేసేలా ఈ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కొత్త సాఫ్ట్ వేర్ మ్యాచింగ్ టెక్నిక్‌ను ఉపయోగించనుంది. దీని ద్వారా వినియోగదారుల ఫోన్లలో స్టోర్ అయిన ఫొటోలు, మెసేజ్‌లు స్కాన్ అవుతాయి. ఫొటోలు, మెసేజ్‌లలో అశ్లీలత ఉందేమో చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే యూజర్లను అలెర్ట్ చేస్తుంది.
ఇదే ఫీచర్ ఫేస్‌బుక్ సహా పలు యాప్స్‌లోనూ ఉంది. అయితే ఇవన్నీ యూజర్ ఫొటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత అశ్లీలతను చెక్ చేస్తాయి. యాపిల్ ఓ అడుగు ముందుకేసి.. అప్‌లోడ్ చేయకముందే స్కాన్ చేసేట్లుగా రూపొందిస్తోంది.
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మాథ్యూ డేనియల్ గ్రీన్.. ఈ విషయంపై ట్వీట్ చేశారు. పిల్లల అశ్లీల చిత్రాలను గుర్తించడానికి క్లయింట్ సైడ్ సిస్టమ్‌ను ప్రారంభించే యోచనలో యాపిల్ ఉందని తెలిపారు. ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజింగ్ సిస్టమ్‌లపై నిఘా పెట్టడానికి ఈ కొత్త టూల్ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ టూల్ ద్వారా ఫోన్లపై నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయని, ఇది ప్రభుత్వాలకు ఆయుధంగా మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.