Paris Olympics 2024: తొలి విజయం సాధిస్తూ, పతక ఆశలు నిలుపుతూ
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. చివరి నిమిషం ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో కీలక విజయాన్ని సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చివరి నిమిషాల్లో గోల్ చేయడంతో భారత్ హాకీ జట్టు ఈ విశ్వ క్రీడల్లో తొలి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది.
తొలుత న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ తొలి గోల్ చేయగా కాసేపటికే మన్‌దీప్ సింగ్ గోల్‌చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన సైమన్ చైల్డ్ గోల్ చేయగా భారత్ కీలక ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్ స్కోరును సమం చేశాడు.
59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి భారత్‌కు విజయాన్ని అందించాడు.
మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన రొనాన్ లాబర్, లూకర్ కోర్వీ జోడీపై విజయం సాధించింది.
. తొలి సెట్‌లో భారత జోడికి కాస్త పోటీనిచ్చిన ఫ్రాన్స్ జోడీ, రెండో సెట్‌లో మాత్రం చేతులెత్తేసింది.
వరుసగా రెండు సెట్లు గెలుచుకుని భారత డబుల్స్ జోడి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.