Joe Root Records: జో రూట్ అరుదైన ఘనత- సచిన్, జయవర్దనే లాంటి దిగ్గజాల జాబితాలో చోటు
భారత్‌తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో జో రూట్ చరిత్ర సృష్టించాడు. 4వ స్థానంలో ఆడుతూ జో రూట్ టెస్ట్ క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.
ఆదివారం నాడు మూడో టెస్ట్ నాల్గవ రోజున జో రూట్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ పై 40 పరుగులు చేసిన రూట్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
టెస్ట్ క్రికెట్‌లో నంబర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రూట్ కంటే ముందు కేవలం ముగ్గురు ఆటగాళ్లు 8 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ అయిన సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో నాలుగో స్థానంలో 179 మ్యాచ్‌లు ఆడగా.. 13,492 పరుగులు చేశాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల జాబితాలో మహేల జయవర్ధనే రెండవ స్థానంలో ఉన్నాడు.
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేళ జయవర్ధనే 124 టెస్ట్ మ్యాచ్లలో 9509 పరుగులు చేశాడు. జాక్ కలిస్ మూడవ స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఆడుతూ కలిస్ 9,033 పరుగులు చేశాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8వేల పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ కూడా చేరాడు. భారత్‌లో జరిగిన మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో అద్భుత శతకంతో రాణించాడు. లార్డ్స్ మైదానంలో ఏకంగా 8వ సెంచరీ చేశాడు రూట్.