Tokyo Olympics 2020: పతకం ఖాయం చేసుకున్న యువ బాక్సర్ లవ్లీనా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నీన్-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది.
తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ అస్సాం అమ్మాయి.. సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఓడినా.. కాంస్య పతకం దక్కుతుంది.
ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీ కోమ్ ఒలింపిక్ పతకం సాధించారు.
బాక్సింగ్‌లో 69కేజీల విభాగంలో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం అందిస్తున్నది కూడా లవ్లీనానే. ఈమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకాలు గెలిచింది.
కోచ్, సహాయ సిబ్బందితో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా.
4-1 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన లవ్లీనాకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.