Shani Dev: శనికి, నలుపు రంగుకి, న్యాయమూర్తులకు లింకేంటి?
హిందూ ధర్మంలో శని దేవుడిని న్యాయమూర్తి లేదా కర్మ ఫలదాత అని కూడా పిలుస్తారు. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. శని దేవుడు మంచి చెడు కర్మలను కూడా నమోదు చేస్తాడని నమ్ముతారు.
శనిదేవునికి నచ్చిన రంగు నలుపు. నలుపు రంగు తీవ్రత, శక్తి .. ప్రతికూలత నుంచి విముక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ నలుపు రంగు శనిదేవునికి న్యాయం రూపంలో ఆదిదేవుడు శివుని ఆశీర్వాదంగా లభించింది. భారతీయ సంస్కృతిలో చెడు దృష్టి నుంచి రక్షించడానికి కూడా నలుపు రంగును ఉపయోగిస్తారు.
పురాణాల ప్రకారం శని దేవుని తల్లి ఛాయా దేవి పరమ శివ భక్తురాలు . ఆమె గర్భంలో శని దేవుడు ఉన్నప్పుడు, ఆమె ఒక తేజస్సుగల కుమారుడి కోసం శివుడిని గురించి ఘోర తపస్సు చేసింది. దీని కారణంగా ఎండ వేడిమి కారణంగా గర్భంలోనే శని దేవుని రంగు నల్లగా మారింది. శని జన్మించినప్పుడు నల్లగా ఉన్నారు. అతని నల్ల రంగును చూసి సూర్య దేవుడు అతన్ని తన కుమారుడిగా గుర్తించడానికి నిరాకరించాడు. దీనితో కోపించిన శని శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు.
నువ్వు అత్యంత శక్తివంతమైన గ్రహంగా మారుతావు శివుడు. అప్పటి నుంచి శని దేవుడికి నచ్చిన రంగు నలుపు. న్యాయదేవత అని పిలిచే శనికి నచ్చిన రందే న్యాయమూర్తులకు కేటాయించారని చెబుతారు
తన నలుపు రంగు కారణంగా.. సూర్య దేవుడు నలుపు రంగును అగౌరవపరచడం వల్ల శని దేవునికి తన నలుపు రంగు చాలా ఇష్టమైనది. శనిదేవుడు తన భక్తులు ఎవరైతే నలుపు రంగు వస్తువులను సమర్పిస్తారో, వారి కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పాడు. అప్పటి నుంచి భక్తులు శని దేవునికి ఇనుముతో చేసిన వస్తువులు, నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్లటి వస్త్రాలు సమర్పించి వారిని సంతోషపరుస్తారు.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాలను జపించండి: ఓం శం శనైశ్చరాయ నమః ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః ఓం శన్నో దేవిర్భిష్టయః ఆపో భవంతు పీతయే. సయ్యోరభీస్రవంతునః