Vastu Tips in Telugu: పక్కోళ్ల వాచ్, ఉంగరం సరదాగా తీసుకుని పెట్టుకుంటున్నారా! అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ఒకరితో ఒకరు పంచుకోవడం లేదా అవసరమైనప్పుడు అడగడం మంచి అలవాటు కావచ్చు. కానీ కొన్నిసార్లు ఇది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. ఎందుకంటే కొన్ని వస్తువులను పొరపాటున కూడా అరువుగా తీసుకుని ఉపయోగించకూడదని చెబుతోంది వాస్తుశాస్త్రం
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నెగటివిటీ, వాస్తు దోషాలను పెంచుతాయి. అలాగే కొన్ని వస్తువులను అరువుగా తీసుకోవడం ఆర్థిక సమస్యలు, అనారోగ్యం దురదృష్టానికి కారణం కావచ్చు.
వస్త్రాలను మార్చుకోవద్దు బట్టలలో చాలా ప్రతికూల శక్తి ఉంటుంది. మీరు ఇతరుల బట్టలు అరువుగా తీసుకుని లేదా ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా ధరిస్తే, ఒక వ్యక్తి యొక్క ప్రతికూల శక్తి మరొక వ్యక్తికి వెళుతుంది.
ఉంగరాన్ని కూడా అడగకూడదు, ధరించకూడదు. ఉంగరం ఏ లోహంతో లేదా రత్నంతో తయారు చేస్తే వారి గ్రహదోషాలు మీకు చేరుతాయి.
ఒక వ్యక్తి అదృష్టం గడియారంతో ముడిపడి ఉంటుందని చెబుతారు. ఒక వ్యక్తి ధరించే గడియారం సమయాన్ని మాత్రమే కాకుండా అతని మంచి మరియు చెడు సమయాలను కూడా సూచిస్తుంది. అందుకే గడియారాన్ని అడగకూడదు, ధరించకూడదు.
పాదరక్షలు లేదా బూట్లు మార్చుకోవడం కూడా మీకు మంచిది కాదు. భారంగా పరిణమిస్తుంది. చెప్పులు శనికి సూచన..ఒకరి పాదరక్షలు ధరిస్తేవారి శని, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయి