స్నానం చేసిన తర్వాత ఈ పనులు చేయకూడదు!
చాలా మంది స్నానం చేసిన వెంటనే నిద్రపోతారు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, స్నానం చేసిన వెంటనే మంచంపై పడుకోవడం వల్ల సూర్యుని తేజస్సు తగ్గుతుంది. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు బద్ధకం, అలసట పెరుగుతాయి.
స్నానం చేసిన తర్వాత, స్నానపు గదిలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోండి. చాలా మంది స్నానం చేసిన తర్వాత బకెట్‌లో మిగిలిన మురికి నీరు, మురికి బట్టలు వంటివి అలాగే వదిలేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, అలా చేయకూడదు. ఈ పనుల వల్ల రాహు-కేతు వంటి గ్రహాలు కోపానికి గురవుతాయి.
స్నానం చేసిన తర్వాత జుట్టు ఊడి బాత్ రూమ్ లో పడిపోతుంది..ఆ జుట్టును బాత్ రూమ్ లో వదిలేయడం మంచిది కాదు. దీనివల్ల శని , మంగళ గ్రహాల నుంచి అశుభ ఫలితాలు కలుగుతాయి.
చాలా మంది స్నానాల గదిలో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు ధరించి స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల రాహు-కేతువుల చెడు దృష్టిని ఎదుర్కోవలసి వస్తుంది.
మహిళలు స్నానం చేసిన వెంటనే నుదుటిపై సింధూరం పెట్టుకోకూడదు. అలా చేయడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుంది. వాస్తవానికి స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉంటుంది మరియు నీరు కూడా కారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సింధూరం పెట్టుకుంటే నీటితో పాటు సింధూరం కూడా నుదుటి నుంచి జారిపోతుంది. అందువల్ల స్నానం చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టి, ఆ తర్వాత నుదుటిపై సింధూరం పెట్టుకోవాలి.