Vastu Tips In Telugu: ఇంట్లో ఏనుగు విగ్రహం ఉందా? ఎలాంటిది ఉండాలి, వాస్తు ప్రకారం ఏ ప్రదేశంలో ఉండాలో తెలుసుకోండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల అదృష్టం, సంపద , సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని నిర్దిష్ట దిశలలో ప్రదేశాలలో ఉంచడం వల్ల దాని ప్రభావాలు పెరుగుతాయి.
ఇంట్లో ఏనుగు విగ్రహం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లేదా ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల ధనం శ్రేయస్సు వస్తూనే ఉంటాయి.
ఏనుగులను రక్షకుని చిహ్నంగా కూడా భావిస్తారు. దీని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల శక్తి లభిస్తుంది
ఏనుగు విగ్రహాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. అదృష్టం, ఆర్థిక లాభం , ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆకర్షిస్తుంది.
ఏనుగు విగ్రహాన్ని ఇంటి ఉత్తర దిశలో ఉంచడం వల్ల కెరీర్... వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
పడకగదిలో ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల సామరస్యం .. శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో ప్రశాంతమైన ఏనుగు విగ్రహాన్ని ఉంచాలి. పిల్లలకు సానుకూల శక్తి చాలా అవసరం, కాబట్టి పిల్లల గదులలో కూడా ప్రశాంతమైన ఏనుగు విగ్రహాన్ని ఉంచాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, తొండం పైకి ఉన్న ఏనుగు విగ్రహం అదృష్టాన్ని తెస్తుంది, అయితే తొండం క్రిందికి ఉన్న ఏనుగు శాంతి సహనానికి చిహ్నంగా పరిగణిస్తారు