Railway Station Closed on Sundays India : ఆదివారం ఈ రైల్వే స్టేషన్‌కు సెలవు.. రీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిగా
ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లా సమీపంలో ఉంది. బర్ధమాన్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌ను రోజువారీ ప్రయాణీకుల రైళ్ల కోసం ఉపయోగించరట.
ఇక్కడ కేవలం బాంకురా-మసాగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే ఆగుతుందట. వారామంతా వచ్చినా.. ఒక రోజు అంటే ఆదివారం రోజు మాత్రం ఈ రైలు కూడా రాదట. దాంతో స్టేషన్ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందని చెప్తారు.
దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే.. ఆదివారం రోజు స్టేషన్ మాస్టర్ రైలు టికెట్ కొనుగోలు చేయడానికి బర్ధమాన్ నగరానికి వెళ్తారట. దీంతో.. ఆ రోజు స్టేషన్లో టికెట్ కౌంటర్, అన్ని సేవలు మూసివేస్తారట.
ఈ స్టేషన్లో ఆదివారం సెలవు రావడానికి ఇదే కారణం. ఈ స్టేషన్ మరొక ప్రత్యేకత ఏమిటంటే దీనికి అధికారికంగా పేరు కూడా లేదు. టిక్కెట్లపై ఇప్పటికీ పాత పేరు రైనాగర్ అనే ఉంటుందట.
అంటే మీరు ఈ స్టేషన్ నుంచి రైలు ఎక్కాలనుకుంటే టికెట్‌పై ఇదే పేరు కనిపిస్తుంది. పేరు లేనప్పటికీ ఈ స్టేషన్ స్థానిక ప్రయాణికులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది బాంకురా, మసగ్రామ్ మధ్య ప్రయాణించేవారికి అవసరమైన స్టాప్.
నివేదికల ప్రకారం.. ఇలాంటి చిన్న స్టేషన్లు తరచుగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికోసం నిర్మించేవారట. తద్వారా స్థానిక ప్రజలకు రైలు సర్వీసుల ప్రయోజనం లభిస్తుందని భావించేవారు.