Vastu Tips For Bad Dreams: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఏవేవో కలలు వస్తున్నాయా? అయితే ఇవి పాటించండి!
చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదు, ఒకవేళ నిద్ర వచ్చినా చెడు కలల వల్ల మెలుకువ వచ్చేస్తుంది. భయంకరమైన కలలు వచ్చిన వెంటనే రాత్రంతా మనస్సు అశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు రాత్రంతా నిద్ర కూడా పట్టదు. ఇందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి
రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు చెడు కలల వల్ల నిద్ర చెదిరిపోతే..నిద్రపోయే ముందు ముత్యం మీ దిండు కింద ఉంచుకోండి. దీనివల్ల ముత్యం సానుకూల శక్తి మీకు శాంతినిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది చెడు కలలు కూడా రావు.
చెడు కలల నుంచి రక్షణ కోసం మీరు స్పటికాన్ని ఉపయోగించవచ్చు. స్పటికాన్ని ఒక గుడ్డలో కట్టి, నిద్రపోయే ముందు ఈ మూటను దిండు కింద ఉంచండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోవడంతో పాటు చెడు కలలు కూడా రావు.
ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల క్రిస్టల్స్ వస్తున్నాయి...వీటిని ఇవి జీవితాన్ని చాలా సులభతరం చేస్తాయి. వాటిలో ఒక క్రిస్టల్ అమెథిస్ట్, ఇది అనేక విషయాలలో ఉపయోగపడుతుంది. దీన్ని దిండుకింద ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి ప్రసారం అవుతుంది
వాస్తు శాస్త్రంలో చెడు కలలు రావడానికి ఏదో ఒక కారణం ఉంటుందని చెప్పారు. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు, ఇది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, చెప్పిన పరిష్కారాలను పాటించండి. దీనివల్ల నిద్రపోయేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది