షూ రాక్ , డస్ట్ బిన్ ఈ దిశలో ఉంటే ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం ఉండదు!
ఇంటి ఉత్తర దిశను వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ దిశను గణేశుడు, కుబేరుడు , లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. అందువల్ల, ఈ దిశలో ఎటువంటి వాస్తు దోషం ఉండకూడదు. ఈ దిశలో దోషం ఉంటే ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది
ఇంటికి ఉత్తర దిశలో బరువైన వస్తువులను ఉంచకూడదు. దీనివల్ల ఆ దిశ యొక్క బరువు పెరుగుతుంది మరియు ఆర్థిక పరిస్థితి ప్రభావితమవుతుంది.
బూట్లు చెప్పులు ఉంచే రాక్ లేదా పనికిరాని వస్తువులను ఈ దిశలో పొరపాటున కూడా ఉంచకూడదు. దీనివల్ల ఇంటి సుఖసంతోషాలు దూరం అవుతాయి.
ఉత్తర దిశలో బాత్రూమ్ కట్టడం మానుకోవాలి. ఎందుకంటే అత్యధిక ప్రతికూల శక్తి బాత్రూమ్ నుంచే వస్తుంది. ఒకవేళ ముందే ఈ దిశలో బాత్రూమ్ కట్టి ఉంటే వాస్తు దోషం తొలగించడానికి బాత్రూమ్ మూలలో ఒక గిన్నెలో ఉప్పు నింపి ఉంచండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో డస్ట్బిన్ ఉంచకూడదు. మీరు డస్ట్బిన్ను నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంచవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో బీరువా ఏర్పాటు చేసుకోవడం, తులసి మరియు మనీ ప్లాంట్ మొక్కలు నాటడం, అద్దం పెట్టడం వంటివి శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.