Vastu Remedies: బాత్రూమ్ నుంచి బెడ్ వరకూ ఇంట్లో అన్ని సమస్యలకు అతి చిన్న పరిష్కారం!
స్ఫటికంలో ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంది. అందువల్ల నీటిలో స్ఫటికాన్ని కలిపి ఇల్లు తుడిస్తే ప్రతికూల శక్తి నశిస్తుంది. కలహాలు ఉండవు. సుఖ సంతోషాలు నెలకొంటాయి
దుకాణం, వ్యాపార స్థలంలో ఆదాయం తగ్గితే, వ్యాపారానికి ఎవరిదృష్టి అయినా తిగిలింది అనిపిస్తే నల్లటి వస్త్రంలో పటికను కట్టి కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. దీనివల్ల వ్యాపారానికి పూర్వ వైభవం వస్తుందని నమ్మకం.
పిల్లలకు భయంకరమైన కలలు వస్తే మంగళవారం , శనివారం నాడు 50 గ్రాముల పటిక తీసుకోండి. నిద్రపోయేటప్పుడు పిల్లల తల దగ్గర పటిక ఉంచండి. పిల్లలకు మంచి నిద్ర వస్తుంది, భయంకరమైన కలల నుంచి విముక్తి లభిస్తుంది.
బంధాలలో చేదు పెరిగినప్పుడు, భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతుంటే, స్పటికాన్ని నల్లటి గుడ్డలో కట్టి మంచం కింద ఉంచండి. ఇది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తుందని చెబుతారు.
రుణ భారం తగ్గడం లేదు, డబ్బు కొరత ఉంది..ఇలాంటి సమయంలో బుధవారం రోజు ఒక స్పటిక ముక్కకు సింధూరం పూసిన తరువాత, ఒక తమలపాకులో చుట్టి దారం కట్టండి. ఇదే రోజు సాయంత్రం రావి చెట్టు కింద పెట్టండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు
వాస్తు ప్రకారం పటిక నీటితో స్నానం ఆచరిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట