Tirumala: హంస వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు
ABP Desam | 08 Oct 2021 09:18 PM (IST)
1
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండో రోజు శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై దర్శనమిచ్చారు.
2
కొవిడ్ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది.
3
హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞానమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు.
4
ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస స్వభావం
5
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
6
శ్రీవారి భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
7
హంస వాహనంపై తిరుమలేశుడు