Sri Krishnastami: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు - సుందరంగా ముస్తాబైన ఆలయాలు, పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, భజనలతో సందడి చేశారు. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌ను అద్భుతంగా అలంకరించారు.
తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే కృష్ణుని దర్శించుకునేందుకు బారులు తీరారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుపతి ఇస్కాన్ టెంపుల్‌ను సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో రాధాకృష్ణులు దర్శనమిచ్చారు.
అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్‌ను శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అద్భుతంగా అలంకరించారు. విద్యుత్ కాంతుల్లో ఆలయం శోభాయమానంగా కనువిందు చేసింది.
అనంతపురం ఇస్కాన్ ఆలయం శిల్పకళ అద్భుతం. ఆలయం వెలుపల శ్రీ కృష్ణుని చరిత్రను వివరించే విధంగా తీర్చిదిద్దారు.
ఇస్కాన్ టెంపుల్‌లో రాధాకృష్ణులను సుందరంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద శ్రీకృష్ణలీలలు తెలిపేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. వీటిని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
అటు, హైదరాబాద్‌లోనూ వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లిలోని ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్‌లో మహిళల కోలాటం అలరించింది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనం కోసం బారులు తీరారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో సైతం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని వేషధారణలో సందడి చేశారు.