కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించేందుకు, కార్తీకం నెలరోజులూ తులసి మొక్క దగ్గర వేసేందుకు అందమైన ముగ్గులు ఇవి!
కార్తీకమాసంలో ఇంటిముందు అందమైన రంగవల్లులు వేస్తారు.. తులసి మొక్క దగ్గర డిజైన్లు వేసి దీపాలు వెలిగిస్తారు.. అందుకోసం ప్రత్యేక డిజైన్లు ఇవి
వివిధ రంగుల మిశ్రమంతో తయారు చేసిన రంగోలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతుంది. పిల్లలు కూడా సింపిల్ గా వేసేయవచ్చు ఈ డిజైన్..సేమ్ డిజైన్ ని పూలతో కూడా తయారు చేయొచ్చు
అందమైన ముగ్గువేసి దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక వాతావరణం వృద్ధి చెందుతుంది..ఇంటి శోభ పెరుగుతుంది
మీకు చాలా తక్కువ సమయంలో సులభంగా అందమైన, చాలా ప్రత్యేకమైన రంగోలిని తయారు చేయాలనుకుంటే, ఈ డిజైన్‌ను తులసి మొక్క దగ్గర కానీ ఇంటి ద్వారం దగ్గర కానీ వేసి దీపాలు వెలిగించవచ్చు . ఈ డిజైన్ వేయడం చాలా తేలిక
లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పే పద్మం ముగ్గు పూజల సమయంలో తప్పకుండా వేస్తారు. ఈ పద్మాన్ని రంగులతో అలంకరిస్తే మరింత అందంగా ఉంటుంది. రంగులు లేకుంటే... పసుపు, కుంకుమ వేసినా బావుంటుంది.