Open Relationships : ఆ దేశంలో ఒక్కో అబ్బాయికి 5 గర్ల్ ఫ్రెండ్స్.. ఎవరూ వారిని జడ్జ్ చేయరట, ఎందుకంటే
ఉత్తర యూరప్‌లోని లాట్వియాలో రిలేషన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడి ప్రజలు, వారి పద్ధతులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
లాట్వాయాలోని జనాభా విషయానికికొస్తే.. అక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువట. అంటే లాత్వియాలో 100 మంది మహిళలు ఉంటే పురుషుల జనాభా 85 నుంచి 87 మధ్యలో ఉంటుంది. దీనివల్ల అక్కడ రిలేషన్స్ భిన్నంగా ఉన్నాయట.
ఇక్కడి అమ్మాయిలు చదువు, ఉద్యోగం, కెరీర్తో పాటు రిలేషన్షిప్ల విషయంలో కూడా చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారట. అందుకే వారి భాగస్వాముల ఎంపిక కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట.
రిపోర్ట్స్ ప్రకారం లాట్వియాలో ఒక అబ్బాయికి 4 నుంచి 5 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నా సరే తప్పుగా భావించరట. అక్కడి ప్రజలు కూడా దానిని తప్పుగా చూడరట. అదే ఇండియాలో అయితే ఒకరితో రిలేషన్లో ఉన్నా కూడా క్యారెక్టర్ లేని వ్యక్తిగా భావించేవారు ఉన్నారు.
లాట్వియా నైట్‌లైఫ్‌లో చాలా బాగుంటుందట. పార్టీలు చేసుకోవడానికి ఇక్కడ బెస్ట్ ప్లేస్‌లు ఉంటాయి. ఇక్కడ బార్లు, క్లబ్‌లు, కేఫ్‌లు యువతతో నిండి ఉంటాయి.
మీరు అక్కడికి వెళ్తే.. వారి మధ్య రిలేషన్స్ చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటాయని మీకు తెలుస్తుంది. డేటింగ్ సంస్కృతి అక్కడ చాలా ఎక్కువుగా ఉంటుంది.
లాట్వియా ఈ ప్రత్యేకత కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇక్కడి జీవనశైలి, రిలేషన్స్ మాత్రం చూసేవారికి కచ్చితంగా వింతగానే ఉంటాయట.