శక్తి, తెలివి, ధైర్యం , రక్షణ, శత్రునాశనం కోసం హనుమంతుడి ఈ రూపాన్ని పూజించాలి!
పంచముఖ హనుమంతుని 5 ముఖాలు... హనుమంతుడు, నారసింహుడు, గరుత్మంతుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉంటారు. రాక్షస సంహారం కోసం హనుమంతుడి రూపం ఇది
హిందూ ధర్మం ప్రకారం ప్రతి ముఖం ఒక ప్రత్యేక దిశకు, శక్తికి ప్రతీక. నారసింహుడు ఉత్తరం, గరుత్మంతుడు దక్షిణం, వరాహుడు వాయువ్యం, హయగ్రీవుడు ఊర్థ్వ లోకం , హనుమంతుడు తూర్పు దిశను రక్షిస్తారు.
అసలు పంచముఖ అవతారం లంకలో మహిరావణుడిని వధించడానికి ఉద్భవించింది. హనుమంతుడు ఐదు దిశలలో దీపాలు వెలిగించి ఒకేసారి ఐదు రూపాలతో రాక్షస శక్తిని అంతం చేశాడు.
పంచముఖి హనుమంతుని పూజించడం వల్ల భయం, ఆటంకాలు, ప్రతికూల శక్తి , శత్రువులపై విజయం లభిస్తుంది. ఇది శక్తి, తెలివి, ధైర్యం రక్షణకు ప్రతీక.
పంచముఖి హనుమంతుని పూజ ప్రధానంగా దక్షిణ భారతదేశం తమిళనాడు కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందింది. భక్తులు హనుమంతుని ఈ రూపాన్ని తంత్ర శక్తి నుంచి రక్షణ కోసం పూజిస్తారు.