నవరాత్రిలో పొరపాటున కూడా ఈ 4 వస్తువులు ముట్టుకోకండి.. బ్లాక్ మ్యాజిక్ బారిన పడతారు!
నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నవరాత్రుల్లో మూడో రోజు..చంద్రఘంటాదేవిని పూజిస్తారు. ఈసారి నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు జరగనున్నాయి. కాబట్టి, ఈ నవరాత్రులలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకుండా ఉండండి.
నవరాత్రుల సమయంలో మీరు ఎక్కడైనా ఎర్రటి వస్త్రం, నిమ్మకాయ, సూది లేదా కొబ్బరికాయను చూసినట్లయితే, పొరపాటున కూడా వాటిని తాకవద్దు. నవరాత్రుల సమయంలో తాంత్రిక క్రియలు చాలా చురుకుగా ఉంటాయి. వాటిని తాకితే మీకు నష్టం జరగవచ్చు.
నవరాత్రుల సమయంలో స్త్రీలను అవమానించేవారిపై అమ్మవారి ఆగ్రహం ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి ఉపాసనలో ఉండేవారు ఆగ్రహానికి దూరంగా ఉండాలి
నవరాత్రి సమయంలో అపరిచితుల నుంచి ప్రసాదం లేదా మిఠాయిలను స్వీకరించవద్దు. ఒకవేళ మీరు అపరిచితుడి నుంచి ఏమైనా తీసుకుంటే దాన్ని పరిశీలించిన తర్వాతే తినండి. కొన్నిసార్లు ప్రతికూల శక్తుల బారిన పడొచ్చు...
నవరాత్రుల సమయంలో ఎవరికైనా మీ బట్టలు లేదా వ్యక్తిగత వస్తువులను ఉపయోగించడానికి ఇవ్వొద్దు. వాటిని ప్రతికూల కర్మలకు ఉపయోగించే అవకాశం ఉంది
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా నల్లటి దుస్తులు ధరించవద్దు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. నవరాత్రులలో ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల దుర్గామాత యొక్క దివ్య శక్తికి ఆటంకం కలుగుతుంది.