ఆగష్టు 31 రాధాష్టమి: ఈ వస్తులు ఇంటికి తీసుకొస్తే మధురాధిపతిలా మీ జీవితం అఖిలం మధురం అవుతుంది!
ధార్మిక విశ్వాసం ప్రకారం, శ్రీకృష్ణుని ప్రేమ భాగస్వామిగా రాధను పూజిస్తారు. రాధ జన్మదినం భాద్రపద మాసం శుక్ల పక్ష అష్టమి.ఈ ఏడాది ఆగస్టు 31 ఆదివారం వచ్చింది
భాద్రపద మాసం శుక్ల పక్ష అష్టమి తిథి ఆగస్టు 30 రాత్రి 7 గంటల 43 నిమిషాలకు ప్రారంభమై ఆగష్టు 31 రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. ఆగస్టు 31 ఉదయం 11:36 నుంచి 1:38 వరకు పూజకు శుభ సమయం.
రాధ పుట్టినరోజును ప్రతి సంవత్సరం రాధా అష్టమి లేదా రాధా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున రాధను పూజించడంతో పాటు కొన్ని శుభకరమైన వస్తువులను ఇంటికి తీసుకురావాలి. ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల సుఖసంతోషాలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం
వేణువు శ్రీకృష్ణుడికి వేణువు అంటే ఎంతో ఇష్టం. ఆ వేణుగానం రాధకి ఇష్టం. అందుకే రాధా అష్టమి రోజున ఇంట్లో వేణువును తీసుకురావడం శుభంగా భావిస్తారు. శ్రీకృష్ణుని చిహ్నమైన వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.
కంబద మొక్క రాధా అష్టమి రోజున ఇంట్లో కదంబ మొక్కను తీసుకురావడం కూడా శుభప్రదం. ఈ చెట్టు కొమ్మలపై కూర్చుని కృష్ణుడు వేణువు వాయించేవాడని నమ్ముతారు. అందుకే రాధాష్టమి రోజున కదంబ మొక్కను ఇంటికి తెచ్చి నాటాలి. ఇది సుఖసంతోషాలను, శోభను పెంచుతుంది.
నెమలి ఈక రాధాష్టమి రోజున శ్రీకృష్ణుడికి సంబంధించిన నెమలిఈకను తీసుకురావడం వల్ల రాధా-కృష్ణుల అనుగ్రహం కుటుంబంపై ఉంటుందని భక్తుల విశ్వాసం