డిసెంబర్ 17 బుధ ప్రదోష వ్రతం, ఈ రోజు సాయంత్రం తప్పకుండా చేయాల్సిన 3 పనులు ఇవే!
ప్రదోష వ్రతం శివునికి అంకితం చేసిన ముఖ్యమైన వ్రతం. ప్రతి నెలా కృష్ణ పక్షం , శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ఈ వ్రతం చేస్తారు. 2025 సంవత్సరపు చివరి ప్రదోష వ్రతం బుధవారం డిసెంబర్ 17 న వచ్చింది.
త్రయోదశి తిథి 16 డిసెంబర్ 2025 రాత్రి 11:57 గంటలకు ప్రారంభమవుతుంది...డిసెంబర్ 17 సూర్యోదయం, సూర్యాస్తమయం సమయానికి ఈ తిథి ఉంది. అందుకే ప్రదోష వ్రతం డిసెంబర్ 17 బుధవారం
సంవత్సరం చివరి బుధ ప్రదోష వ్రతం రోజున శివలింగంపై పాలు, పెరుగు, నీరు, తేనె, మారేడు ఆకులు, పువ్వులు సమర్పించి ప్రదోష కాలంలో పూజ చేయండి. అలాగే, ఈ రోజున శివుడిని మెప్పించడానికి ఈ 3 పనులు కూడా తప్పకుండా చేయండి.
ప్రదోష వ్రతం నాడు శివుని ప్రత్యేక అనుగ్రహం పొందాలనుకుంటే, ఆ రోజున నీటిలో నువ్వులు వేసి శివలింగంపై సమర్పించండి. ఈ పరిహారంతో మీకున్న గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు
సంవత్సరం చివరి ప్రదోష వ్రతం నాడు బియ్యం, పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేయండి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది
ప్రదోష వ్రతం రోజున శివ తాండవ స్తోత్రం పఠించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి.