Instagram Followers : ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్క రాత్రిలో పెరగాలంటే..ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరగాలంటే ప్రధానంగా మీ కంటెంట్ బాగుండాలి. ఎక్స్పర్ట్స్ ఏమి చెప్తున్నారంటే.. మంచి కంటెంట్ మాత్రమే కాదు. ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ తయారు చేయడం అవసరం. రీల్స్ ఈరోజు చాలా బలమైన ఆయుధంగా చెప్పవచ్చు. ట్రెండింగ్ ఆడియోలతో మీరు రీల్ కంటెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. కంటెంట్ మొదటి 2-3 సెకండ్లలో ఆకర్షిస్తే.. బాగా వైరల్ అవుతుందని చెప్తున్నారు.
చాలా మంది కష్టపడి పోస్ట్ చేస్తారు. కానీ రాంగ్ టైమ్‌లో పోస్ట్ చేస్తారు. Instagram అల్గారిథం ప్రారంభ ఎంగేజ్‌మెంట్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఫాలోవర్స్ అత్యంత యాక్టివ్‌గా ఉన్నప్పుడు పోస్ట్ చేయాలి. దీనివల్ల లైక్‌లు, కామెంట్లు, షేర్‌లు త్వరగా వస్తాయి. పోస్ట్ ఎక్కువ మందికి చేరుతుంది.
చాలా మంది ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తే పోస్ట్ వైరల్ అవుతుందని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఉపయోగకరమైన, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. పెద్ద హ్యాష్‌ట్యాగ్‌లతో పాటు, మీ పోస్ట్ సరైన ప్రేక్షకులకు చేరుకోవడానికి మీడియం, నిచ్ హ్యాష్‌ట్యాగ్‌లను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం.
Instagram కేవలం పోస్ట్‌లు పెట్టే ఆట మాత్రమే కాదు.. ఇది ఒక సంభాషణ వేదిక కూడా. మీరు ఇతరుల పోస్ట్‌లకు కామెంట్స్ చేయడం, మీ కామెంట్స్‌కి రియాక్ట్ అవ్వడం, స్టోరీలకు రెస్పాండ్ అవ్వడం వల్ల మీ పేజ్ ఎంగేజ్మెంట్ బాగుంటుంది. దీనివల్ల అల్గోరిథం మీ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. కొత్త ఫాలోవర్లు రావడం ప్రారంభిస్తారు.
బయో, ప్రొఫైల్ ఫోటో, హైలైట్‌లు మీ మొదటి గుర్తింపు. కాబట్టి స్పష్టమైన, ఆకర్షణీయమైన, విలువను తెలియజేసే ప్రొఫైల్‌ను చూసి ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. ప్రొఫైల్ గందరగోళంగా ఉంటే.. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఫాలోవర్స్ పెరగరు.