రాత్రి పూట విజిల్ వేస్తే దయ్యాలు వస్తాయా?
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవకూడదు, రాత్రివేళ విజిల్ వేయకూడదు..ఇలా చాలా విషయాలు పెద్దలు చెబుతుంటారు
అప్పట్లో లైట్లు ఉండేవి కాదు. అందుకే చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడిస్తే విలువైన వస్తువులు ఒక్కోసారి పోతాయేమో అని... సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చకూడదు అని చెప్పేవారు
చీకటి పడిన తర్వాత పాలగిన్నె మూతతీసి ఉంటే ఆత్మలు వచ్చి తాగుతాయని చెప్పేవారు..వాస్తవానికి పాలపై మూతపెట్టకపోతే పురుగులు పడి విషయపూరితంగా మారే అవకాశం ఉంది...అవి ప్రాణానికి ప్రమాదంగా మారొచ్చు
గ్రహణం సమయంలో ఆ కిరణాలు ఆహారంపై పడితే త్వరగా పాడైపోతుంది..అది తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గ్రహణం సమయంలో భోజనం చేయొద్దంటారు
రాత్రి వేళ విజిల్స్ వేస్తుంటే వద్దని చెబుతుంటారు పెద్దలు...ఆత్మలు వస్తాయని భయపెడతారు. నిజానికి అప్పట్లో గ్రామాలన్నీ అడవికి, తోటలకు సమీపంలో ఉండేవి. విజిల్స్ వేస్తే అడవిజంతువులు వస్తాయని అలా చెప్పేవారట
చీకటి పడ్డాక గోర్లు కట్ చేస్తే దురదృష్టం అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం.. చీకట్లో గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకప్పటి పరిస్థితుల ఆధారంగా చెప్పివనే..కాలక్రమేణా నమ్మకాలుగా స్థిరపడిపోయాయి
రాత్రివేళ రావిచెట్టుకింద పడుకుంటే దయ్యాలు వస్తాయని చెబుతుంటారు..వాస్తవానికి రాత్రివేళ రావిచెట్టు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. ఆ సమయంలో చెట్టుకింద పడుకుంటే అనారోగ్య సమస్యలొస్తాయి.అందుకే అలా చెప్పేవారు
రాత్రి వేళ కుక్కలు అరవడం అశుభం అంటారు..వాస్తవానికి తమ చుట్టూ చిన్న మార్పులను కూడా కుక్కలు పసిగడతాయి. అందుకే రాత్రివేళ మరింత చురుగ్గా ఉంటాయి