Mangala Gauri Vrat Rules : మంగళ గౌరీ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలా? ఏం తినాలి , ఏ పదార్థాలకు దూరంగా ఉండాలి?
శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేస్తారు. ఈ రోజు అమ్మవారి ఎనిమిదో రూపం అయిన మహాగౌరిని మంగళగౌరిగా పూజిస్తారు.
అన్ని వ్రతాలు , పండుగల వలె మంగళ గౌరీ వ్రతానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వేకువ జామునే నిద్రలేచి స్నానమాచరించింది వినాయక, గౌరీపూజకు అవసరం అయిన సామగ్రి సిద్ధం చేసుకోవాలి
మంగళ గౌరీ వ్రతంలో నిర్జల వ్రతం అవసరం లేదు. ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు లేదంటే ఒక్కపూట భోజనం చేయొచ్చు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోకూడదు, నియమాలు పాటించాల్సి ఉంటుంది
వ్రతం సమయంలో సగ్గుబియ్యం, సీజనల్ పండ్లు, జ్యూస్, పాలు, పెరుగు తీసుకోకూడదు. ఒకపూట భోజనం చేయాలి అనుకుంటే అమ్మవారికి నివేదించిన పులగం, పరమాన్నం, మాహానివేదనగా సమర్పించిన ఆహారపదార్థాలు తినొచ్చు.
మంగళగౌరి వ్రతం ఆచరించేవారు తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని కూడా తినకూడదు.
ఏ వ్రతం ఆచరించినప్పుడైనా..శరీరాన్నే కాదు మనసుని కూడా నియంత్రించడం చాలా ముఖ్యం. నోములు, వ్రతాలు ఆచరించినప్పుడు ప్రవర్తనలో సంయమనం పాటించాలి. కఠినమైన మాటలు మాట్లాడకూడదు