లాబుబు బొమ్మను ఇంట్లో ఉంచుకోవాలా వద్దా! వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
లబూబూ (Labubu) చైనీస్ బొమ్మ.. దీనికి కుందేలు లాంటి చెవులు, పెద్ద కళ్లు, పదునైన పళ్లు ఉంటాయి. ఈ బొమ్మలు 'బ్లైండ్ బాక్స్'లలో వస్తాయి. బాక్స్ తెరిచినప్పుడే బొమ్మ ఏ రంగులో, ఏ డిజైన్‌లో ఉంటుందో తెలుస్తుంది. ఈ సస్పెన్స్ మార్కెటింగ్ వ్యూహం. ఈ మధ్య సెలబ్రిటీల ప్రచారం, సోషల్ మీడియా కారణంగా లబూబూ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది
దీని విచిత్రమైన ఆకృతి ఆకర్షణీయమైన డిజైన్ దీనిని స్టేటస్ సింబల్ గా మార్చింది. అయితే, దీని గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీనిని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తే, మరికొందరు అశుభమని భావిస్తారు. దీనిపై చర్చ ఇంకా కొనసాగుతోంది.
కొంతమంది Labubu Doll ను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. చాలా మంది వ్యక్తులు ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత తమ ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక పరిస్థితి దిగజారిందని ... చెడు సమయం ప్రారంభమైందని వాదించారు. ఈ బొమ్మ ప్రభావం వ్యక్తి అవగాహన మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే వస్తువులు సానుకూల శక్తిని అందిస్తాయి. ఏదైనా వస్తువు ప్రతికూల శక్తికి కారణమైతే, దానిని ఇంట్లో ఉంచకూడదు. Labubu Doll విచిత్రమైన మరియు భయంకరమైన ఆకారం కారణంగా, కొన్నిసార్లు ఇది ప్రతికూల శక్తికి చిహ్నంగా భావిస్తున్నారు మెజార్టీ ప్రజలు
కొందరు Labubu Doll కేవలం ఒక సాధారణ బొమ్మ అని, దీనికి ఎలాంటి ఆధ్యాత్మిక లేదా వాస్తు సంబంధిత ప్రభావం లేదని నమ్ముతారు. ఇంట్లో ఉంచుకోవడం లేదా ఉంచుకోకపోవడం పూర్తిగా వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ఈశాన్య దిశలో ఉంచే వస్తువులు సానుకూల శక్తిని తెస్తాయి. ఈ దిశలో ఉంచడం వల్ల ఈ బొమ్మ యొక్క శుభ ప్రభావం పెరుగుతుందని చెబుతున్నారు
Labubu Doll ని ఇంట్లో ఉంచుకోవాలా లేదా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీరు దీన్ని శుభంగా భావిస్తే, ఇంట్లో ఉంచుకోవచ్చు. కానీ ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీరు భావిస్తే, దానిని ఇంటికి దూరంగా ఉంచడం మంచిది.