పిండ ప్రదానం చేసినట్టు కల వచ్చిందా ఎప్పుడైనా? ఇది దేనికి సంకేతం?
2025 సెప్టెంబర్ 21 ఆదివారం సర్వ పితృ అమావాస్య...ఇది పితృ పక్షం చివరి రోజుగా పరిగణిస్తారు. పితృ పక్షంలో తర్పణం, పిండదానం , శ్రాద్ధం ద్వారా పితృదేవతలకు శ్రద్ధాంజలి అర్పిస్తారు.
మనిషి నిద్రలో చాలా రకాల కలలు కంటాడు, ఇది సాధారణం. కానీ పితృ పక్షంలో మీకు పిండం లేదా తర్పణం కలలు వస్తే, అది పితృదేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కలల అర్థం ఏమిటో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం పితృ పక్ష సమయంలో స్వప్నంలో పిండం చేస్తూ చూడటం చాలా శుభం. అంటే మీరు పితృ రుణ విముక్తి పొందబోతున్నారు.
మీరు పదే పదే పిండదాన్ కలలు కంటుంటే, పూర్వీకుల ఆత్మలు విముక్తి పొందాలని కోరుకుంటున్నాయని ఇది సూచిస్తుంది. కుటుంబంలో పితృదేవతల కోసం శ్రాద్ధం, తర్పణం లేదా ఏదైనా కర్మ అసంపూర్తిగా ఉండిపోయినా, అటువంటి కలలు వస్తాయి.
పిండప్రదానం చేసిన కల వస్తే మీరు పితృదేవతలకు తర్పణం ఇచ్చి ఉండకుంతే తప్పకుండా ఇవ్వాలని సూచన. రావిచెట్టుకుని నీరు పోసి పితృదేవతలను స్మరించుకోవాలి.
స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పిండం చూసిన తర్వాత ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఇది శుభ సూచన. ఇది పితృదేవతల సంతృప్తి మరియు ఆశీర్వాదం యొక్క సంకేతం. కానీ అలాంటి కల వచ్చిన తర్వాత మీరో ఆందోళన , ఏదో భయం ఉంటే ఇది పితృదేవతల అసంతృప్తికి సంకేతం కావచ్చు.