Shiva Re Release: 'శివ' సినిమాలో నాగార్జున 4k స్టిల్స్... రీ రిలీజ్ స్పెషల్

'శివ' సినిమాలో నాగార్జున స్టిల్స్
'శివ' సినిమాకు, అందులో కింగ్ అక్కినేని నాగార్జున సైకిల్ చైన్ లాగే సన్నివేశానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో 4k స్టిల్స్ రీ రిలీజ్ చేశారు. వాటిపై ఒక లుక్ వేయండి.
నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సినిమాను 4k క్వాలిటీలో కన్వర్ట్ చేసి డాల్బీ డీటీఎస్ టెక్నాలజీలోకి అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నారు.
'కుబేర'తో నటుడిగా, 'కూలీ'తో ప్రతినాయకుడిగా కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 'శివ' రీ రిలీజ్ ఆయనకు హ్యాట్రిక్ అవుతుంది.
తెలుగు సినిమాలో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చిన సినిమా 'శివ'. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో నటించిన అమలను తర్వాత నాగార్జున పెళ్లి చేసుకున్నారు.
'శివ' రీ రిలీజ్ పోస్టర్