కార్తీక పౌర్ణమి రోజు మట్టితో చేసిన ఈ 5 వస్తువులను తప్పకుండా కొనండి!
నవంబర్ 5న కార్తీక పూర్ణిమ . హిందూ ధర్మంలో ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున దేవ దీపావళి కూడా జరుపుకుంటారు.
కార్తీక పూర్ణిమ నాడు మట్టితో చేసిన కొన్ని వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం
కార్తీక పూర్ణిమ రోజున మట్టి కుండ తీసుకురావడం శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు కుండ తీసుకురాలేకపోతే, మట్టితో చేసిన చిన్న కలశాన్ని కూడా తీసుకురావచ్చు.
కార్తీక పూర్ణిమ రోజు మట్టితో చేసిన ఏనుగును తెచ్చి ఉత్తర దిశలో ఉంచండి. వాస్తు ప్రకారం ఇది ధన లాభాన్నిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో వెండి, బంగారం, ఇత్తడి వంటి లోహాల విగ్రహాలను ఉంచుకుంటారు. కానీ దేవతల మట్టి విగ్రహం కూడా శుభప్రదంగా ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు మీరు ఈరోజు మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు.
కార్తీక పూర్ణిమ నాడు మట్టి ప్రమిద తప్పనిసరిగా కొనండి.. వెలిగించండి. మట్టి దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది శ్రేయస్సు పెరుగుతుంది.
కార్తీక పూర్ణిమ నాడు పిల్లలకు మట్టి బొమ్మలు తెచ్చి ఇవ్వండి. ఇంటి సుఖసంతోషాలు పెరుగుతాయి.