Maida Side Effects : మైదా తింటే క్యాన్సర్ వస్తుందా? నిపుణుల హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం
మైదాను గోధుమ పిండిలోని ఫైబర్, పోషకాలను తీసి తయారు చేస్తారు. ఇందులో విటమిన్లు కానీ మినరల్స్ కానీ ఉండవు. అంటే ఇది కేవలం కేలరీలను మాత్రమే ఇస్తుంది. పోషణను కాదు. అందుకే దీనిని empty calories అంటారు.
తరచుగా మైదా తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. నిరంతరం అధిక ఇన్సులిన్ స్థాయిలు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి.
ఆ వాపు కాలక్రమేణా కణాలకు నష్టం కలిగిస్తుంది. నిరంతర మంట క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణాల పెంచుతుంది.
మైదాలో తరచుగా బ్లీచింగ్ ఏజెంట్లు, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటివి ఉపయోగిస్తారు. దీనివల్ల ఇది తెల్లగా మారుతుంది. ఈ రసాయనాలు శరీరానికి హానికరమైనవిగా పరిగణిస్తారు. ఇవి కాలేయంపై ప్రభావం చూపించవచ్చు.
ఎక్కువ మైదా తినడం వల్ల కడుపులో సమస్యలు పెరుగుతాయి. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటివి వస్తాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండదు. పేగుల కదలికను నెమ్మదించేలా చేస్తుంది.
నిపుణులు ప్రకారం పూర్తిగా మైదాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ దాని పరిమాణాన్ని పరిమితం చేయాలి. శుద్ధి చేసిన పిండికి బదులుగా గోధుమలు, జొన్న లేదా సజ్జల పిండిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.
సమతుల్య ఆహారం, పీచు పదార్థాలు కలిగిన ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.