5 Remedies to Get Rid of Evil Eye: చెడు దృష్టితో ఇబ్బంది పడుతున్నారా? నిమ్మకాయ-మిరపకాయ కాదు ఈ 5 పాటిస్తే ఉపశమనం కలుగుతుంది!
హిందూ ధర్మం ప్రకారం మన చుట్టూ రెండు రకాల శక్తి ఉంటుంది. వాటిలో ఒకటి సానుకూలమైనది, మరొకటి ప్రతికూలమైనది. ఇలాంటప్పుడు చెడు దృష్టి నుంచి రక్షించుకోవడానికి చాలాసార్లు నిమ్మకాయ-మిరపకాయలను ఇంటి ముందు కడతారు
నిమ్మకాయ మిరపకాయ చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి కానీ ఎవరికైతే చెడు దృష్టి తగులుతుందో..అప్పుడు నిమ్మకాయ మిరపకాయతో కాదు, ఈ 5 వస్తువులతో చెడు దృష్టి తొలగిపోతుంది.
ఎవరైతే తమపై చెడు దృష్టి ఉందని భావిస్తున్నారో వారు ప్రతి సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇల్లు లేదా వ్యక్తిపై చెడు దృష్టి ఉంటే అది నెమ్మదిగా తొలగిపోతుంది.
చేపట్టిన పనికి పదే పదే అడ్డంకులు ఎదురైనప్పుడు మీరు మీ ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వండి
వేప ఆకులతో స్నానం చేయడం వల్ల కూడా ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. వేపకు కుజుడు, శని , కేతు గ్రహాలతో సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో, వేప ఆకులను ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మంగళవారం రోజు కర్పూరంతో పాటు లవంగాలు వెలిగించడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుంది.
శనివారం సాయంత్రం సమయంలో శని చాలీసా పారాయణం చేయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుంది. ఈ సమాచారాన్ని అనుసరించే ముందు మీకు నమ్మకమైన పండితుల సలహాలు స్వీకరించండి...