New Year 2026 Remedies : కొత్త సంవత్సరం 2026 మొదటి రోజున ఈ పని చేయండి, సంవత్సరం పొడవునా దురదృష్టం దూరంగా ఉంటుంది!
2026 జనవరి 1 అంటే నూతన సంవత్సరం మొదటి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు. మీరు కూడా నూతన సంవత్సరాన్ని చాలా ప్రత్యేకంగా ఆహ్వానించండి.
సంవత్సరం ప్రారంభం ఏ శక్తితో జరుగుతుందో, అది సంవత్సరం అంతా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. కాబట్టి, 2026 మొదటి రోజున కొన్ని ప్రత్యేకమైన మతపరమైన చర్యలు తీసుకుంటే, దురదృష్టం సంవత్సరం పొడవునా దూరంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతికూల శక్తిని ఇంటి నుంచి తరిమేయండి. చెత్త, పనికిరాని వస్తువులను బయటకు తీసేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే, గుమ్మానికి పసుపు నీరు లేదా గంగాజలం చల్లి శుద్ధి చేయండి
సంవత్సరం ప్రారంభాన్ని దేవుని ధ్యానంతో ప్రారంభించండి. ఉదయం లేచి మొదట చేతులు జోడించి దేవుడికి ప్రార్థించండి. సంవత్సరం మొదటి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయండి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి . పూజా మందిరంలో దీపం వెలిగించండి. అలాగే ప్రతిరోజూ స్నానం, ధ్యానం, పూజ మొదలైనవి చేయాలని కూడా ప్రతిజ్ఞ చేయండి..
నూతన సంవత్సరం గురువారం రోజున ప్రారంభమవుతోంది. సంవత్సరాన్ని శుభంగా మార్చుకోవడానికి తులసి మొక్కను తప్పనిసరిగా నాటండి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది . ఇంట్లో ఇప్పటికే తులసి మొక్క ఉంటే నీరు సమర్పించి పూజలు చేయండి
నూతన సంవత్సరం మొదటి రోజున పేదలకు, అవసరమైన వారికి ఆహారం, దుప్పట్లు లేదా వెచ్చని బట్టలు దానం చేయడం కూడా ఉత్తమం. ఈరోజు చేసే దానాలవల్ల సంవత్సరం పొడవునా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.