New Year 2026 : దుష్ట దృష్టి నుంచి మీ ఇంటిని రక్షించుకునేందుకు నూతన సంవత్సరం సందర్భంగా ఈ వస్తువులను తీసుకురండి!
ప్రధాన ద్వారంపై గుర్రపు నాడాను ఉంచితే మీ ఇంటిని చెడు దృష్టి నుంచి రక్షిస్తుందట. అందుకే నూతన సంవత్సరంలో గుర్రపు నాడాను ప్రధాన ద్వారంపై వేలాడదీయండి. దీనివల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని చెబుతారు.
ఈసారి 1 జనవరి 2026 న గురువారం వస్తోంది. సంవత్సరపు మొదటి రోజు ఇత్తడి బాల గోపాల్ లేదా గణేష్ విగ్రహాన్ని ఇంట్లో లేదా మీ కార్యాలయంలో ప్రతిష్టించండి. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం
న్యూ ఇయర్ మొదటి రోజు గురువారం రావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు మంచి రోజు అని చెబుతున్నారు
లక్ష్మీదేవికి ప్రీతికరమైన పసుపురంగు గవ్వలు తీసుకొచ్చి ఇంట్లో దేవుడి మందిరంలో ఉంచడం చాలా శుభప్రదం
నూతన సంవత్సరంలో ఇంట్లో మారేడు చెట్టును నాటవచ్చు. ఇది ఉండటం వల్ల కుటుంబంపై శివుని కృప ఉంటుంది. దుఃఖం, దారిద్ర్యం ఉండవు.
నూతన సంవత్సరం మొదటి రోజున శ్రీ యంత్రాన్ని ఇంట్లో స్థాపించండి. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెబుతారు.