Bhagavad Gita: భగవద్గీతలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాలు - వాటి అర్థాలు ఇవే!
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులు, బంధువులు, గురువులు, స్నేహితులని చూసి అర్జునుడి హృదయం వికలమైంది. రాజ్యం కోసం వారిని వధించలేనని బాధపడతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి || నీకర్మలను నువ్వు ఆచరించు...నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాన్ని ఆశించి ఎట్టిపరిస్థితుల్లోనూ కర్మలు చేయవద్దు..అలాగని కర్మలు చేయడం మానకు..
వాసంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి| తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ|| చినిగిన వస్త్రాలు విడిచిపెట్టి కొత్త దుస్తులు ఎలా ధరిస్తామో..జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మకూడా మరో దేహంలోకి ప్రవేశిస్తుంది..
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి కోపం వల్ల అవివేకం వస్తుంది..అవివేకం వల్ల మతిమరుపు..మతిమరుపుతో బుద్ధినాశనం..దాంతో మనిషే నాశనం అవుతాడని అర్థం..
తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార | ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: || చేసే పనిని పూర్తిచేయండి..పదే పదే దాని ఫలితంపై ఆసక్తి ఉండకూడదు. కర్మ ప్రకారం మీరు ఆచరించాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి..
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ| యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ || పొగతో నిప్పు...ధూళితో అద్దం..మావితో గర్భస్థ శిశువు కప్పి ఉన్నట్టే ..కామం జ్ఞానాన్ని కప్పేస్తుంది..
ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ లేకపోవచ్చు..అలాంటి వారికోసమే ఈ కొన్ని శ్లోకాలు..