గణేష్ చతుర్థి నాడు పొరపాటున అయినా ఈ రెండు పనులు చేస్తే ఆయష్షు తగ్గిపోతుంది!
పండుగలు అంటే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపేస్తాయి..ఈ రోజు చేయకూడని కొన్ని పనులున్నాయి
గణేష్ చతుర్థి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గణపయ్య ఇంట్లో కొలువుతీరిన ఈ రోజున జుట్టు , గోర్లు కత్తిరించడం అశుభంగా భావిస్తారు.
గణేష్ ఉత్సవం 10 రోజులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఏ ఇంట్లో అయితే వినాయక విగ్రహాన్నిపెడతారో ఆ ఇళ్లలో ఈ రోజుల్లో వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదని చెబుతారు. దీనివల్ల ఆయుష్షు తగ్గుతుందని నమ్మకం.
గణేష్ ఉత్సవం సమయంలో తామసిక భోజనం ఇంట్లో ఉంచకూడదు, తినకూడదు. దీనివల్ల వ్యక్తి కెరీర్, జీవితం ప్రభావితమవుతుందని నమ్మకం.
గణేష్ చతుర్థి పండుగ సమయంలో 10 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించండి . మనస్సులో సాత్విక ఆలోచనలు ఉంచుకోండి. ఈ సమయంలో ఎవరినీ అవమానించవద్దు.
గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటం నిషేధం. ఈ రోజున చంద్రుడిని చూస్తే దోషం. వినాయక పూజ చేసి కథ చదివి అక్షతలు తలపై వేసుకుంటే దోషం ఉండదు