క్రాసులా మొక్క మనీ ప్లాంట్ కన్నా ప్రత్యేకమైనదా? దీన్ని ఏ దిశలో ఉంచితే సంపద పెరుగుతుందో తెలుసా!
హిందూ ధర్మం మరియు ఫెంగ్ షుయ్ లో క్రస్సుల మొక్కను అదృష్టం, సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్కను దుకాణంలో లేదా ఇంట్లో నాటడం వల్ల స్వామి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని ..సంపద పెరుగుతుందని చెబుతారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో క్రస్సుల మొక్కను నాటడానికి సరైన నియమాలు ఏంటో తెలుసుకుందాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫెంగ్షుయ్ ప్రకారం క్రాసులా మొక్క ప్రతికూలతను దూరం చేయడమే కాకుండా ఇంట్లో సంపదను తెస్తుంది . ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా శాంతియుతంగా ఉంచుతుందని చెబుతారు. అదే సమయంలో, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు కూడా దీనితో తొలగిపోతాయట
ఫెంగ్షుయ్ ప్రకారం, ఇంటిలో క్రాసులా మొక్కను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ కుబేరుడికి సంబంధించినది, కాబట్టి ఈ దిశలో మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో ధనం వస్తుంది. అంతేకాకుండా, మీరు దీనిని ఈశాన్య దిశలో కూడా ఉంచవచ్చు.
క్రాసులా మొక్కను జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున నాటడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుందని నమ్ముతారు.
క్రాసులా మొక్కను సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. అలాగే, ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. పొరపాటున కూడా దీన్ని టాయిలెట్, బాత్రూమ్ లేదా వంటగది దగ్గర ఉంచకూడదు.
ధనం పెరగడానికి ...చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగించడానికి క్రాసులా మొక్క పచ్చగా ఉండాలని నమ్ముతారు. కాబట్టి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి