Celebrities Who Quit Non Veg : చికెన్, మటన్ మానేసిన సెలబ్రెటీలు.. అమితాబ్ బచ్చన్ నుంచి ఆలియా భట్ వరకు, రీజన్స్ ఇవే
అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన తన శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ.. మాంసాహారం తినడం మానేశారు. మొదట్లో ఆయన మాంసాహారం బాగా తినేవారట. కానీ ఇప్పుడు తన ఆహార ప్రణాళికను మార్చుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ జాబితాలో అనుష్క శర్మ పేరు తదుపరి స్థానంలో ఉంది. 2015లో PETA ప్రమోషన్ల సమయంలో ఆమె ఈ నిర్ణయం గురించి ప్రస్తావించారు. మాంసాహారం మానేసిన తర్వాత తనలో మునుపటి కంటే ఎక్కువ ఎనర్జీ వచ్చిందని తెలిపింది.
బాలీవుడ్ బేబో అంటే కరీనా కపూర్ కూడా శాఖాహారిగా మారింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మాంసాహారం కంటే శాఖాహారిగా ఉండటం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని భావిస్తున్నానని చెప్పింది. షాహీద్ కపూర్‌తో డేటింగ్ సమయంలో ఆమె వెజిటేరియన్‌గా మారింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా వెజిటేరియన్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకుంది. ఒకప్పుడు నటి మాంసాహార ప్రియురాలు. కానీ తరువాత యోగా, ధ్యానంపై దృష్టి పెడుతూ మాంసాహారానికి కూడా వీడ్కోలు పలికింది.
జాన్ అబ్రహం కూడా సినిమాలతో పాటు ఫిట్నెస్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా జంతు హక్కుల మద్దతుగా మాట్లాడతారు.. ఈ అంశంపై కూడా పని చేస్తారు. దీనిలో భాగంగా తన ఫిట్నెస్ను పూర్తిగా శాఖాహారంగా మార్చుకున్నారు.
షాహిద్ కపూర్ కూడా మాంసాహారం నుంచి దూరంగా ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు అతను కూడా మాంసాహారం తినేవాడు. కానీ ఇప్పుడు నటుడు పూర్తిగా శాఖాహారిగా మారాడు. తన జీవనశైలిని అలాగే కొనసాగిస్తున్నాడు.
విద్యా బాలన్ కూడా చాలా కాలంగా నాన్‌వెజ్ మానేసింది. పూర్తిగా శాఖాహారిగా మారి.. జీవనశైలిలో మార్పులతో శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మార్పు వచ్చిందని నమ్ముతుంది ఈ భామ.
ఆలియా భట్ కూడా ఈ జాబితాలో భాగం. 2020లో మాంసాహారం మానేసి.. ఆమె పూర్తిగా శాఖాహారిగా మారాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత తన ఆరోగ్యం, చర్మంలో చాలా మార్పులు వచ్చాయని ఆమె చాలాసార్లు ప్రస్తావించింది.
సోనమ్ కపూర్ కూడా మాంసాహారం మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆనందిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఆమె శాఖాహార ఆహారాన్ని స్వీకరించారు. ఈమె పాలకు కూడా దూరంగా ఉంటారు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. నటుడు తన 50వ పుట్టినరోజున శాఖాహారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. మాంసాహారం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని నటుడు దీనికి దూరంగా ఉన్నాడు.