Dream Interpretation: కలలో బొద్దింక కనిపిస్తే అది ప్రమాదకరమైన సంకేతమా?

Dream Interpretation What does it mean to see a cockroach in a dream
మీ కలలో ఆహారంలో లేదా పానీయాలలో బొద్దింకలను చూడటం అనేది మీకు లేదా మీ కుటుంబానికి తీవ్రమైన అనారోగ్యం సంభవించబోతోందనడానికి ఒక సంకేతం అని చెబుతారు స్వప్నశాస్త్ర నిపుణులు.
మీ పడకపై బొద్దింకను కలగనడం అనేది సంబంధానికి సంబంధించిన ఆందోళనలకు సంకేతంగా పరిగణిస్తారు. ఈ కల మీ వివాహంలో లేదా ప్రేమ సంబంధంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చని సూచిస్తుంది.
కలలో బొద్దింక మీ దగ్గరకు రావడం చూడటం అశుభంగా పరిగణిస్తారు. శత్రువులు మీకు హాని కలిగించవచ్చని ఇది సూచిస్తుంది. విరోధులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉండవచ్చు. వీరు రహస్య శత్రువులు కావచ్చు.
మీకు ఎగిరే బొద్దింక కల వస్తే, అది ఊహించని సవాళ్లకు సంకేతం. అందువల్ల, మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు.
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో బొద్దింకలు ఉండటం అత్యంత హానికరం. దీనివల్ల ఇంటి శ్రేయస్సుకు ఆటంకం ఏర్పడి, సంపాదించిన డబ్బు మందులకే ఖర్చవుతుంది.
బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వార్తల్లో నిలిచారు..దీంతో..సోషల్ మీడియాలో బొద్దింకల గురించి వివిధ రకాల సమాచారం కోసం వెతుకుతున్నారు నెటిజన్లు