5 రోజుల పాటు చోర పంచకం! ఈ సమయంలో బంగారం కొనకూడదు..ఇంకా ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశుభ నక్షత్రాల కలయిక ఏర్పడినప్పుడు ‘పంచక్’ ఏర్పడుతుంది. సాధారణంగా దీనిని అశుభ ఫలితాలను ఇచ్చే సమయంగా భావిస్తారు.
చంద్రుడు ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రాలపై సంచరిస్తున్నప్పుడు పంచక కాలం అంటారు. చంద్రుడు కుంభం , మీన రాశులలో సంచరించినప్పుడు కూడా పంచకం ఏర్పడుతుంది.
పంచకంలో.. రోగ పంచకం, మృత్యు పంచకం, అగ్ని పంచకం, రాజ పంచకం , చోర్ పంచకం ఉంటాయి. శుక్రవారం నాడు ప్రారంభమైనప్పుడు, దానిని 'చోర్ పంచకం' అంటారు.
అక్టోబర్ 31 శుక్రవారం నాడు చోర పంచకం ప్రారంభమవుతుంది. ఐదు రోజుల పాటూ ఈ ప్రభావం ఉంటుంది..అందుకే ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టకూడదు
చోర పంచకం ఐదు రోజులలో ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలి. ఈ సమయంలో చేసిన ఆర్థిక లావాదేవీలు ధన నష్టానికి కారణమవుతాయని నమ్ముతారు. అలాగే దక్షిణ దిశకు ప్రయాణం చేయకుండా ఉండాలి.
చోర పంచకం సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో చేసే పనుల వల్ల శుభ ఫలితాలు తక్కువగా వస్తాయని నమ్ముతారు.
వివాహాలు, నిశ్చితార్థాలు, ఉపనయనం, కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనడం, పెట్టుబడులు వంటి పనులు కూడా చోర పంచకం సమయంలో చేయడం అశుభంగా భావిస్తారు.