చీమలకు పంచదార, స్వీట్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? దానివెనుకున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటి?

Chimalu Panchadara AdhyatmikaSandesam
చీమలకు మంచి వాసన శక్తి ఉంటుంది..వాటి శరీరంపై ఉంటే ఆంటెన్నాలపై చిన్న రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి రసాయనాలను గుర్తిస్తాయి. ఓ చీమ యాదృచ్ఛికంగా తిరుగుతుంటుంది. దానికి తియ్యటి వాసన తగలగానే అది ఆహారాన్ని మోసుకెళ్తుంది.
ఆహారాన్ని తీసుకెళ్లే చీమ..తన గమనాన్ని సూచిస్తూ Pheromone Trail రిలీజ్ చేస్తుంది.. ఆ వాసన ఆధారంగా మిగిలిన చీమలన్నీ ఆ మార్గాన్ని అనుసరిస్తాయి. ఆహారం పూర్తయ్యేవరకూ ట్రైల్స్ సాగుతాయి
ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే చీమలు..కర్మ, సమూహబాధ్యత, ధైర్యం, దైవిక సంకేతాలు. హిందూ సంప్రదాయంలో చీమలు శుభసూచనగా భావిస్తారు.
నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే శుభం జరుగుతుందని, సంపద కలిసొస్తుందని నమ్మకం. చీమలకు ఆహారం వేస్తే శని ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.
చీమలు ఒక్కటిగా కాకుండా కలసికట్టుగా పనిచేస్తాయి. బ్రహ్మాండంలో ఏకత్వాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా కాకుండా సమాజం కోసం పనిచేయాలనే సందేశాన్నిస్తుంది
చీమలు రసాయనిక సంకేతాలు వాడితే ఆధ్యాత్మికంగా అంతర్ దృష్టి, గురు కృప లాంటి దైవిక మార్గాలు అనుసరించాలనే సూచిస్తోంది.
చీమలు చిన్నవైనా భారీ బరువు మోస్తాయి..ఎప్పుడూ పనిచేస్తాయి.. ఇది భగవద్గీతలో కర్మయోగాన్ని సూచిస్తుంది
చీమలు తియ్యటి పదార్థాలవైపు ఆకర్షితులైనట్టే.. మనం సాధన ద్వారా ఆధ్యాత్మిక మధురం..జ్ఞానం, ఆనందం, మోక్షం వైపు అడుగువేయాలని సూచిస్తుంది