అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకూ సూర్యుడి పూజ (ఛఠ్ పూజ) ఎలా చేయాలి? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి?
దీపావళి తర్వాత వచ్చే ఆరో రోజు నుంచి వరుసగా నాలుగు రోజులు (అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28) ఛఠ్ పూజ (సూర్యుడి పూజ) జరుపుకుంటారు. ఈ పండుగ పరిశుభ్రత , పవిత్రతకు చిహ్నం. ఈ నాలుగు రోజులు సూర్యభగవానుడు, ఛాయాదేవికి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు
ఛఠ్ పూజ నహాయ్-ఖాయ్ తో ప్రారంభమవుతుంది. ఈ రోజున వ్రతం చేసేవారు నదిలో స్నానం చేస్తారు .. సాత్విక ఆహారం తీసుకుని వ్రతం చేస్తారు. ఈ రోజున సైంధవ లవణం నెయ్యితో చేసిన అరవా బియ్యం సొరకాయ కూర ప్రసాదంగా తింటారు.
ఖర్నా ఛఠ్ పూజ రెండవ రోజు. ఈ రోజున వ్రతం చేసేవారు రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు.. సాయంత్రం ప్రత్యేకమైన భోగాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి నేవేదించిన తర్వాత తింటారు. దీనిని 'ఖర్నా' లేదా 'లోహండా' అంటారు. దీని తరువాత 36 గంటల నిర్జల వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజున పాయసం బెల్లం మరియు అరువా బియ్యంతో తయారు చేస్తారు.
చఠ్ పూజ మూడవ రోజు ఇది అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున అస్తమిస్తున్న సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ రోజు సాంప్రదాయ వంటకాలు సిద్ధం చేసి ఛాయాదేవికి నివేదిస్తారు
ఛఠ్ పూజా నాల్గవ రోజున ఈ వ్రతం చివరి రోజు. ఈ రోజు సూర్యుడు ఉదయించినప్పుడు అర్ఘ్యం సమర్పిస్తారు. పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత అందరకీ పంచిపెడతారు