ఈ రోజు సాయంత్రం బుధప్రదోష వ్రతం ఆచరిస్తే మీరు ఏ పని ప్రారంభించినా అడ్డంకులే ఉండవు!
శివుని అనుగ్రహం పొందడానికి, కోర్కెలు నెరవేరేందుకు ప్రదోషం వ్రతం ఆచరిస్తారు. ప్రతి నెలా శుక్లపక్షం, కృష్ణ పక్షంలో ..రెండు త్రయోదశిలు వస్తాయి. ఈ రోజున ప్రదోషవ్రతం ఆచరిస్తారు
ప్రదోష వ్రతం ఏ రోజు వస్తే ఆ రోజుతో కలపి పిలుస్తారు.. ఆగష్టు 20 బుధవారం ప్రదోషవ్రతం వచ్చింది అందుకే బుధ ప్రదోష వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్ని లాభాలో శివపురాణంలో ఉంది
బుధవారం, ఆగస్టు 20న, శ్రావణ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి ఉంటుంది . ప్రదోష వ్రతం పూజ సాయంత్రం సూర్యాస్తమయం ముందు నిర్వహిస్తారు.
ప్రదోష వ్రతం అంటే శివపూజ చేస్తారు..పైగా బుధవారం గణేషుడి రోజు. అందుకే ఈ రోజు ప్రదోష వ్రతం ఆచరిస్తే శివుడు-గణేషుడి అనుగ్రహంతో మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది
బుధ ప్రదోష వ్రతం రోజున వ్రతం ఆచరించి పూజలు చేస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ వ్రతం వల్ల మంచి బుద్ధి కూడా లభిస్తుంది.
శివపురాణం, స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండటం వల్ల రోగాలు, దోషాలు తొలగిపోతాయి, ధన, సంపదలు పెరుగుతాయి జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి.