Badrinath Dham Mystery: ఈ క్షేత్రంలో కుక్కలు మొరగవు, మేఘం గర్జించదు, మెరుపు వచ్చినా ఉరుము రాదు! మిస్టరీ ఇదే!
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో అలకనందా నది ఒడ్డున బద్రీనాథ్ ధామ్ ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ,ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. చార్ ధామ్ యాత్రలలో ఇదొకటి
బద్రీనాథ్ ధామ్ లో భగవాన్ విష్ణువు కొలువయ్యాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు బదరీ వృక్షం కింద తపస్సు ఆచరించాడని..అందుకే బద్రీనాథ్ అని పేరొచ్చిందని చెబుతారు
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే..బద్రీనాథ్ ధామ్ లో కుక్కలు అస్సలు మొరగవట. అంతే కాదు..ఇక్కడ మెరుపు వస్తుంది కానీ ఉరుము ఉండదు. మేఘం వర్షిస్తుంది కానీ గర్జించదు..దీనివెనుక ఆసక్తికర కథనం ఉంది
బద్రీనాథ్ ధామ్ లో విష్ణువు ధ్యాన ముద్రలో ఉంటాడు. అందుకే ప్రకృతి నుంచి జంతువుల వరకు అంతా ఆయన తపస్సులో సహకరిస్తాయని నమ్మకం. అందుకే కుక్కలు మొరగవు..మేఘం వర్షించిన గర్జించదని చెబుతారు
బద్రీనాథ్ దేవాలయం సముద్ర మట్టానికి దాదాపు 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. గర్భగుడి లోపల, శాలిగ్రామ శిలతో చేసిన నల్లని శిలా విగ్రహం ఉంది.. పద్మాసనంలో నాలుగు భుజాలు కలిగిన విష్ణువు రూపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు