Salakatla Brahmotsavam: కన్నుల పండువగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా జరుగుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉదయం 9 నుంటి 10 వరకూ, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు నిర్వహిస్తామన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని, పాత బర్డ్ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. అలానే శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ కన్నడ, హిందీ భాషల్లో ప్రారంభించనున్నారు. ఇంకా తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తారు.
కరోనా కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరుగుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వర్ణ రథం, తేరుకి బదులుగా సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు