Home Insurance Claim: సునామీలో ఇల్లు డ్యామేజీ అయితే మీకు క్లెయిమ్ వస్తుందా, ఈ బీమా ఎలా పొందాలి
సాధారణంగా తీసుకునే హెల్త్ ఇన్సురెన్స్, టర్మ్ ఇన్సురెన్స్ లకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ సునామీలో మీ ఇల్లు పూర్తిగా ధ్వంసమైతే, బీమా క్లెయిమ్ చేయవచ్చా ? సునామీ వచ్చి మీ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయితే పరిస్థితి ఏంటన్న వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
సునామీ లాంటి సహజ విపత్తులు సాధారణంగా యాక్ట్ ఆఫ్ గాడ్ (Act Of God) కేటగిరీ కిందకు వస్తాయి. కొన్ని బీమా పాలసీలు ఈ రకమైన నష్టాలను క్లెయిమ్ కవర్ చేస్తాయి. కానీ ప్రతి పాలసీలో ఇలా ఉండదు. మీ హోమ్ ఇన్సూరెన్స్ లో సహజ విపత్తు కవర్ లేదా అదనపు ప్రొటెక్షన్ కనుక మీరు యాడ్ చేస్తే సునామీ వల్ల కలిగే ఇంటి నష్టం, ఇంటి ధ్వంసానికి మీరు క్లెయిమ్ పొందవచ్చు.
చాలా మంది హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలో సునామీ లాండి యాడ్ ఆన్ ప్రొటెక్షన్‌లను చేర్చరు. ఇది ఒక యాడ్ ఆన్ కవర్ కింద ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా సునామీ లాంటివి యాడ్ చేసుకోవాలి. మీరు కేవలం ఫైర్ లేదా తుఫాను కవర్ తీసుకుంటే, మీకు సునామీ వల్ల మీ ఇంటికి కలిగే నష్టానికి క్లెయిమ్ లభించదు.
పాలసీ తీసుకునేటప్పుడు ఏయే పరిస్థితుల్లో మనకు కవర్ అవుతున్నాయో చెక్ చేసుకోవడం ముఖ్యం. సునామీ సంభవించి ఇల్లు మీ దెబ్బతిన్నా లేదా పూర్తిగా కూలిపోయినా, మీరు నష్టాలను క్లెయిమ్ చేయవచ్చు. ఇందులో గోడలు, పైకప్పు, తలుపులు, ఇతర ఐటమ్స్ ఉంటాయి.
మీ పాలసీలో కంటెంట్ కవర్ కూడా ఉంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు, సోఫా ఫర్నిచర్ వంటి వాటి నష్టాలను సైతం క్లెయిమ్ పొందవచ్చు. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి మీరు పాలసీ కాపీ, నష్టానికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియో, లోకల్ ఆఫీసర్ రిపోర్ట్, బీమా కంపెనీ సర్వేయర్ నివేదిక వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి
మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోతే ప్రభుత్వం లేదా స్థానిక అధికారుల నుంచి కొంత మేర పరిహారం అందవచ్చు. కానీ వాటి మీద నమ్మకం పెట్టుకోవడం సరికాదు. సహాయ నిధి తాత్కాలిక ఆశ్రయం లేదా నిత్యావసరమైన వస్తువుల వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కనుక మీరు తీర ప్రాంతంలో నివాసం ఉంటే సహజ విపత్తు కవర్ తో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని సూచిస్తున్నారు.