International missiles:ప్రపంచంలో ఏ ప్రాంతాన్నై ధ్వంసం చేసే క్షిపణులు ఉన్న దేశాలు!అందుకే వాటిని సూపర్‌పవర్స్ అని పిలుస్తారు!
నేటి కాలంలో, ఒక దేశం సూపర్ పవర్ అని పిలుస్తున్నారంటే, పెద్ద ఆర్థిక వ్యవస్థ లేదా పెద్ద సైన్యం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కూడా ముఖ్యమైనది.
ఈ సామర్థ్యం కేంద్ర బిందువు లాంగ్ రేంజ్ బాలిస్టిక్, సబ్ సర్ఫేస్ లాంచ్ మిసైల్స్. ఈ మిసైల్స్ కలిగిన దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.
మొదటగా, వాస్తవానికి ఖండాంతర క్షిపణిని ప్రయోగించగల సామర్థ్యం ఉన్న దేశాల గురించి మాట్లాడుకుందాం, అవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు భారతదేశం, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్నాయి లేదా అభివృద్ధి దశలో ఉన్నాయి.
దేశాల క్షిపణి సామర్థ్యాలు వాటి ప్రపంచ ప్రభావాన్ని, భద్రతా విధానానికి వెన్నెముకగా ఉన్నాయి. రష్యా, అమెరికా ఇప్పటికీ అతిపెద్ద ఆటగాళ్లుగా చెబుతారు. వీటికి సైలో-ఆధారిత, మొబైల్ లాంచర్లు, జలాంతర్గామి-ప్రయోగ వ్యవస్థలు (SLBM) రెండూ ఉన్నాయి, ఇవి సుదూర లక్ష్యాలకు అణ్వస్త్రాలను చేరవేయగలవు.
చైనా కూడా తన ICBM నెట్‌వర్క్ , మొబైల్ క్షిపణులను విస్తరించడం వేగవంతం చేసింది, దీని వలన ఇప్పుడు అది కూడా ప్రపంచ-శ్రేణి సామర్థ్యాలలో అగ్రగామిగా మారుతోంది. SIPRI ఇతర నివేదికల ప్రకారం ఈ మూడు దేశాల ఆధునికీకరణ ప్రాజెక్టులు 2020లలో చాలా వేగంగా పెరిగాయి.
కొన్ని ప్రసిద్ధ క్షిపణులు ఈ చిత్రాన్ని మరింత స్పష్టం చేస్తాయి. అమెరికా-యుకె Trident II (D5) SLBM జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తుంది. ఖండాంతర పరిధిలో భారీ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రష్యా కొత్త RS-28 సర్మత్, చైనా DF-41 ఎక్కువ దూరం మమల్టీ వార్‌హెడ్ సామర్థ్యం కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్షిపణులు ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలవని వాదనతో అభివృద్ధి చేశారు
చిన్న ,మధ్య తరహా శక్తుల పాత్ర కూడా మారుతోంది. భారతదేశం అగ్ని-V వంటి క్షిపణుల ద్వారా ఖండాంతర పరిధి సామర్థ్యాన్ని సాధించింది. ఇది ప్రాంతీయ , వ్యూహాత్మక సమతుల్యతలో తన స్థానాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించింది. అదే సమయంలో, ఉత్తర కొరియా కూడా ఇటీవలి పరీక్షలలో ఘన ఇంధన ఇంజిన్, సుదూర నమూనాలపై పనిని వేగవంతం చేసింది.